నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా గుంటూరులో జరిగిన స్పేస్ క్విజ్ లో నారాకోడూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని హెచ్ఎం ఏడుకొండలు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి విద్యార్థి నశ్రీన్, 9వ తరగతి బాలభవ్యశ్రీ, 8వ తరగతి హారిక బహుమతులు పొందారని చెప్పారు. విజేతలతో పాటు పాఠశాల సైన్స్ టీచర్ అరుణ కుమారి, గైడ్ టీచర్ ఉపాధ్యాయులు అభినందించారు.