సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెనాలి సీఐ మల్లిఖార్జునరావు అన్నారు. తెనాలిలో ఆదివారం పోలీసులు వారథి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో తమ ఫొటోలు పెట్టకూడదన్నారు. అపరిచితులకు వ్యక్తిగత వివరాలను ఇవ్వరాదని తెలిపారు.