పునరావాస కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ నాగలక్ష్మి

79చూసినవారు
పునరావాస కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజతో కలిసి కొల్లిపర మండలం అన్నవరంలంకలో పర్యటించారు. కృష్ణానది కరకట్ట లోపల వరద నీటి ముంపుకు గురైన గ్రామాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల ద్వారా కొల్లిపరలోని పునరావాస కేంద్రాలకు తరలింపును పరిశీలించారు. కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున కరకట్ట గ్రామాల ప్రజలందరిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్