ప్రకృతి విపత్తు వల్ల భారీ పంట నష్టం వాటిల్లిందని.. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కొల్లిపర మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన అత్తలూరు వారి పాలెం, వల్లభాపురం, ముల్లంగి, కొల్లిపర, హనుమాన్ పాలెం, పాతబొమ్మవానిపాలెం, గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదన్నారు.