ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి సాధించిన ఘనత స్వాతంత్య్రం అని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణంలోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వేడుకలలో సబ్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ గోపాలకృష్ణ, రెడ్ క్రాస్ ఛైర్పర్సన్ భానుమతి, తదితర సభ్యులు పాల్గొన్నారు.