అద్దంకిలోని సుందరయ్య భవనం నందు ఆదివారం సీఐటీయూ మండల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుధర్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడి, మధ్యాహ్న భోజన, ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులు తగవని అన్నారు.