అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి శుక్రవారం బాపట్లలో జరిగిన రైతులకు అండగా వైయస్సార్ పార్టీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆయన విమర్శించారు. రైతు భరోసా, గిట్టుబాటు ధర ఎక్కడ అని హనిమిరెడ్డి ప్రశ్నించారు. రైతులకు అండగా వైయస్సార్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.