పంగులూరు నుండి బూదవాడ వెళుతున్న 108 అంబులెన్స్ కు ఇంకొల్లు నుండి అద్దంకి వెళుతున్న ఆర్టీసీ బస్సు దారి ఇవ్వని సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అంబులెన్స్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి పంగులూరు సెంటర్ కు వచ్చేసరికి ఎదురుగా బస్సు వచ్చింది. అత్యవసర కేసు ఉందని దారి ఇవ్వాలని అంబులెన్స్ పైలెట్ ఆర్టీసీ డ్రైవర్ ను కోరగా ససేమిరా అనటంతో చేసేదేమీ లేక అంబులెన్స్ పైలట్ వెనక్కి వెళ్ళాడు.