బాపట్ల : చివరి ఎకరా వరకు నీరు ఇవ్వాలి: ఎమ్మెల్యే నక్కా

73చూసినవారు
బాపట్ల : చివరి ఎకరా వరకు నీరు ఇవ్వాలి: ఎమ్మెల్యే నక్కా
బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడి లాకులు వద్ద బుధవారం ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు చివరి ఎకరా వరకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. దానికి సంబంధించి కాలువలపై పెండింగ్ పనులు ఉంటే ఎస్టిమేషన్స్ వేసి వెంటనే పంపించాలన్నారు. ఈ సమ్మర్ సీజన్ ముగిసేలోగా పనులు పూర్తవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్