బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. సభ్యత్వ నమోదుతో కార్యకర్త కుటుంబానికి పార్టీ భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబి రెడ్డి, బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.