బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందనీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ను వేరే చోటకి తరలించి కూటమి ప్రభుత్వం బాపట్ల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. బాపట్ల వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ మేరుగ నాగార్జున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.