బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దుండి వారి పాలెం, యాజలి పంచాయతీ పరిధిలో 794/1 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూములలో శుక్రవారం అక్రమ మైనింగ్ జరుగుతున్నదని జిల్లా జై భీమ్ రావ్ భారత పార్టీ అధ్యక్షులు పర్రె కోటయ్య ఆరోపించారు. కర్లపాలెం తహశీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ ఇసుక రవాణాను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ రవాణా అరికట్టాలన్నారు.