చీరాల: పులి శ్రీనివాసరావు మృతి కేసును చేదించాలి

64చూసినవారు
చీరాల: పులి శ్రీనివాసరావు మృతి కేసును చేదించాలి
చీరాలలోని టిడిపి క్యాంప్ కార్యాలయం నందు శనివారం డి ఎస్పి జగదీష్ నాయక్, సీఐ శేషగిరిరావు, ఎస్సై శివకుమార్ లతో ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన పులి శ్రీనివాసరావు మరణంపై ఆయన సమీక్షించారు. కేసు పురోగతిని ఎమ్మెల్యే డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కేసు నిజా నిజాలు వెంటనే వెలికి తీయాలని ఆయన వారిని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడాలని ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్