అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా పోలీసు జాగిలం ''ఫాక్సీ''

53చూసినవారు
అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా పోలీసు జాగిలం ''ఫాక్సీ''
బాపట్ల జిల్లా పోలీసు భద్రతా విభాగంలో 2022 సం. నుండి విశేష సేవలు అందించిన పోలీసు ట్రాకర్ జాగిలం "ఫాక్సీ" (5. 3 సం) అనారోగ్యంతో మృతి చెందింది. 'ఫాక్సీ'' మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తీవ్ర సంతాపం వ్యక్తం చేసినారు. బుధవారం డాగ్ కెన్నెల్ భవనo వద్ద "ఫాక్సీ" పార్థివదేహంకు ఎస్పీ పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిపించారు.

సంబంధిత పోస్ట్