బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు అందించారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ ప్రతి అర్జీని పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.