కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెం పంచాయతీ నక్కలవారి పాలెం గ్రామంలో కనుమ పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సుబ్బారావు, శ్రీనివాసరావు, నక్కల ఊర్లయ్య, చిన్న సాంబయ్య గ్రామ యువత పాల్గొన్నారు.