బాపట్ల మున్సిపల్ డీఈగా కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరణ

64చూసినవారు
బాపట్ల మున్సిపల్ డీఈగా కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరణ
బాపట్ల పురపాలకసంఘం డిప్యూటీ ఇంజనీరుగా కృష్ణారెడ్డి గురువారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా బాపట్ల పురపాలక సంఘానికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. పురపాలక సంఘంలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పలువురు సిబ్బంది కృష్ణారెడ్డిని స్వాగతించారు.

సంబంధిత పోస్ట్