పెదనందిపాడు మండలం వరగాని గ్రామ ప్రధాన రహదారిలో చిలకలూరిపేట కు చెందిన పాశం దుర్గారావు అత్తగారిల్లు అన్నపర్రు వచ్చి శుక్రవారం తిరిగి వెళుతున్న క్రమంలో మద్యం తాగి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. 108 వాహనం రాకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్షతగాత్రున్ని వైద్యశాలకు తీసుకువెళ్లారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.