బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గా బి శ్రీమన్నారాయణ శనివారం డిపో కార్యాలయంలో నూతన మేనేజర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇన్చార్జి మేనేజర్ గా పనిచేసిన అజిత కుమారి పొన్నూరుకు రిపోర్ట్ చేశారు. నూతన మేనేజర్ శ్రీమన్నారాయణ ను ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తానని మేనేజర్ శ్రీమన్నారాయణ తెలిపారు.