చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం సామాజిక భద్రత పెన్షన్లను అధికారులు తనిఖీ చేశారు. పట్టణ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న 31 పెన్షన్లను అధికార బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిబాబు మాట్లాడుతూ. అర్హత ఉన్నవారికే వివిధ రకాల సామాజిక భద్రత పెన్షన్లు మంజూరు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీ చేపడుతున్నట్లు తెలిపారు.