బాపట్ల జిల్లా చీరాలలోని ఆంధ్ర రత్న హైస్కూల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పవని భానుచంద్ర మూర్తి, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలో సోమవారం రాత్రి ఏ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ పురస్కారం ఆయనకు అందజేశారు.