గుంటూరు నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు సెట్ బ్యాక్ పోర్షన్ లో జనరేటర్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం ఐపీడీ కాలనీ, బుడంపాడు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా అపార్ట్ మెంట్ నిర్మాణాలను కమిషనర్ పరిశీలించారు.