రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారం గుంటూరులో ఆందోళన జరిగింది. సీపీఎం, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కరెంటు బిల్లులను దగ్ధం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సర్ ఛార్జీల పేరుతో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రామారావు ఆరోపించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.