గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల 20, 21 వ తేదీల్లో ఆదర్ష్-2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సీ. హెచ్ రామకృష్ణ వెల్లడించారు. బుధవారం కళాశాల ఆవరణలో బ్రోచర్లను అధ్యాపకులతో కలిసి రామకృష్ణ ఆవిష్కరించారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, చెస్, త్రో బాల్, అథ్లెటిక్స్, క్యారమ్స్ పోటీలు జరుగుతాయన్నారు.