కొలకలూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం

59చూసినవారు
తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ ప్రజలు సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎటువంటి లెక్కాపత్రం లేకుండా నిధులను సొంత ప్రయోజనాల కోసం పంచాయతీ అధికారులు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్