గుంటూరు నగరపాలక సంస్థలో మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ బాలాజీకి ఓ ఘటన ఎదురైంది. సమావేశం జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లకు స్నాక్స్ పంపిణీ చేశారు. అయితే ఆ స్నాక్స్ ని ఓపెన్ చేయగా బూజు పట్టిన జీడిపప్పు దర్శనమిచ్చింది. దీనిని ఆయన కమిషనర్, మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.