రుణాలు అందించడంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కార్పోరేషన్లలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 29న విజయవాడలో కమిషనర్ పులి శ్రీనివాసులు అవార్డ్ ను అందుకుంటారు. చిరు వ్యాపారులకు పీఎం స్వానిధి రుణాల అందించడంలో జాతీయస్థాయిలో నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపికైంది. బ్యాంకుల ద్వారా 21, 594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా గుంటూరు జీఎంసీ తొలి స్థానంలో నిలిచిందని శనివారం కమిషనర్ వెల్లడించారు.