గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డ్రోన్ ఎగరవేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో యూట్యూబర్ గుంటూరు నందిని డ్రోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి తీసుకొని మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, తన డ్రోన్ తనకి ఇచ్చారని వివరణ ఇచ్చారు.