గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అతిధిగా ఐదవ కోర్టు జడ్జి కె. లత హాజరై మాట్లాడారు. పోలీసులు కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడానికి కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.