పరిపాలనా వ్యవస్థలో సివిల్ సర్వీసెస్ కు ప్రత్యేక స్థానం ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గుంటూరులో సివిల్స్ ప్రిపరేషన్ పై ఎమ్మెల్సీ లక్ష్మణరావు రూపొందించిన పుస్తకాన్ని పెమ్మసాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పోటీ పరీక్షలకు క్లాసులు నిర్వహించడం, పుస్తకాలు రూపొందించడంలో లక్ష్మణరావు కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారని చెప్పారు.