గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం నల్ల చెరువు రిజర్వాయర్ ని ఆకస్మికంగా చేశారు. తాగునీటిని ప్రైవేట్ అవసరాలకు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, అలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నీటి ట్యాంకర్ల వివరాలను పొందుపర్చిన రిజిస్టర్ ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.