గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ చవితి పందిళ్ళతో కళకళలాడాల్సిన సమయంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాలు పాలు చేశాయని ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. చవితి పందిళ్ళు సాంప్రదాయ బద్ధంగా పరిమితం చేసి, మిగిలిన నిధులను బాధితులకు ఆదుకోవడానికి వినియోగించుకోవాలని కోరారు.