జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా 2,759 కేసులు పరిష్కారం

65చూసినవారు
జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా 2,759 కేసులు పరిష్కారం
గుంటూరు జిల్లాలోని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సారథ్యం వహించారు. ఇందులో 258 సివిల్ కేసులు, 1, 848 క్రిమినల్ కేసులు, 194 చెక్ బౌన్స్ కేసులు, 150 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 7 కార్మిక వివాదాలు, 64 వివాహ కేసులు, 56 బ్యాంక్ కేసులు, 129 ప్రీ-లిటిగేషన్ మొత్తం 2, 759 కేసులు పరిష్కారమయ్యాయి.

సంబంధిత పోస్ట్