అన్ని దానాల్లో కెల్లా అన్నదానం చాలా గొప్పదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభివర్ణించారు. సోమవారం గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీనివాసరావు పేట 1వ లైన్, బ్రాడిపేట 1/17వ లైన్, మంగళ దాస్ నగర్ వినాయక చవితి ఉత్సవాల్లో మాధవి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.