ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే మాధవి

54చూసినవారు
ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మాధవి ట్రాఫిక్ అధికారులకు సూచించారు. నగరంలో ట్రాఫిక్ అధికమవుతున్న నేపథ్యంలో శ్రీనివాసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ట్రాఫిక్ సీఐ సింగయ్య, వారి సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరువ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్