గుంటూరులో వర్క్ ఫ్రం హోం పేరుతో మోసం

52చూసినవారు
వర్క్ ఫ్రం హోం పేరుతో చీటింగ్ చేశారంటూ పలువురు యువకులు సోమవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచే వర్క్ చేసుకొని నెలకు రూ. 50, 000 సంపాదించవచ్చు అంటూ ఇంస్టాగ్రామ్ లో లింక్ పెట్టాడు. ఆ లింకు క్లిక్ చేసిన వారికి అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఒక్కొక్కరి వద్ద రూ. 30 వేల చొప్పున వసూలు చేసి మోసగించాడని బాధితులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్