గుంటూరు జిల్లా డీఎస్సీ ఉచిత శిక్షణకు షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 25తో గడువు ముగిసినా ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.