గుంటూరులోని రేంజ్ ఐజీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. రేంజ్ ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల్లో పోలీసు అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.