ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల రసాయనాల వినియోగం తగ్గిపోతుందని నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేశ్ చంద్ తెలిపారు. ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే సబ్సిడీ భారం తగ్గితే ఆ మొత్తాన్ని రైతుల ప్రయోజనాల కోసం వినియోగించ వచ్చునని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయం మరింతగా విస్తరించాలంటే పాఠశాల సిలబస్ లో చేర్చి పిల్లలకు బోధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు.