బోరుగడ్డ అనిల్ ను కస్టడీకి ఇవ్వాలని గుంటూరు అరండల్ పేట సీఐ శ్రీనివాసరావు 5వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పిటీషన్ దాఖలు చేశారు. గుంటూరులోని ఏఈ ఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి కోశాధికారి బాబూప్రకాశ్ ను రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని అనిల్ కుమార్ బెదిరించాడు. ఈ కేసులో పోలీసులు బోరుగడ్డను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.