గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా సూర్య శ్రావణ్ కుమార్ గురువారం కలెక్టరేట్ లోని విజిలెన్స్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన ఈశ్వరరావును సీఐడీ విభాగానికి స్థానచలనం చేశారు. గురువారం గుంటూరు నూతన విజిలెన్స్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ ను ఆ శాఖ డీఎస్పీలు, సీఐలు, పలు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.