యూటీఎఫ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 60వేల ఆర్థిక సాయం

80చూసినవారు
యూటీఎఫ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 60వేల ఆర్థిక సాయం
వరద బాధితుల సహాయార్థం యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూ. 60 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సాయం చెక్కును డీఈవో శైలజకు గురువారం అందజేశారు. ఊహించని విధంగా వచ్చిన వరదల వల్ల ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా నష్టం జరిగిందని డీఈఓ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే మాధవి, యూటీఎఫ్ ప్రతినిధులు ఆదిలక్ష్మి, కళాధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్