గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఎన్నికలలో చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారని, 4 నెలలు దాటినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంకా అమలు చేయలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.