గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆర్ అండ్ బి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గం లోని రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్లపై సమీక్ష చేశారు. వీలైనంత త్వరగా రోడ్ల పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించి, మొత్తం రోడ్ల గ్రాంట్లపై సమీక్ష చేశారు.