మాచవరం యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న టీంలకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దారం అమ్ములమ్మ లక్ష్మీరెడ్డి, జడ్పీటీసీ శివ యాదవ్, సర్పంచ్ నరేష్, ఎంపీడీవో వరప్రసాద్ పాల్గొన్నారు.