ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు వారి వారి సమస్యలు, సలహాలకు బుధవారం డయల్ యువర్ డిఎం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ పిచ్చయ్య మంగళవారం తెలిపారు. మాచర్ల డిపో పరిధిలోని పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సలహాలు సూచనలు తెలియజేయాలని తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఏమైనా సందేహాలు ఉంటే 9959225432 ఫోన్ చేయాలన్నారు.