పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమృకోటలో సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తుమృకోట శివారులో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి, ఆవుదూడని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులకి సమాచారం అందజేసినట్లు గ్రామస్థులు చెప్పారు. పెద్దపులి సంచారంతో రెంటచింతల వాసులు భయాందోళనకు గురవుతున్నారు.