మాచర్ల నియోజకవర్గంలో భారీ వర్షం

76చూసినవారు
మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. వారం రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురవుతున్నామని సాగర్ పరిసర ప్రాంత ప్రజలు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తుఫాన్ కారణంగా రోడ్లపై నీరు నిలిచింది. దీంతో కాలినడకన వెళ్లేవారు, ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్