మాచర్లలో విష జ్వరాలు ప్రజలకుండా పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సచివాలయ శానిటరీ కార్యదర్శులను మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయాల కార్యదర్శులు, ఏఎన్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేపట్టి విషజ్వరాలు వచ్చిన వారిని గుర్తించాలన్నారు. విష జ్వరాలు వచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.