నేరాలు జరగకుండా నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సచివాలయ మహిళా పోలీసుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మత్తుపదార్థాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. సచివాలయ పరిధిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలన్నారు.